జూన్ 2020
'శ‌శి' చిత్రం డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం



(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న 'శ‌శి' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్నారు.

హీరో ఆది సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ద్వారా సోమ‌వారం 'శ‌శి' చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని బ్యాన‌ర్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆది డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు. లాక్‌డౌన్ ముగిసి, సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన దానికి అనుగుణంగా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ డ‌బ్బింగ్ ప‌నులు స్టార్ట్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న జోడీగా సుర‌భి న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ పోషిస్తున్నారు.

ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న 'శ‌శి' సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండ‌గా, అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
ఆది సాయికుమార్‌, సుర‌భి, రాశీ సింగ్‌, వెన్నెల కిశోర్‌, తుల‌సి, జ‌య‌ప్ర‌కాష్‌, రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్‌, స్వ‌ప్నిక‌, శిరీష‌, శ‌ర‌ణ్య‌, హ‌ర్ష‌, మ‌హేష్‌, కృష్ణ‌తేజ‌, భ‌ద్రం, వేణుగోపాల‌రావు.

సాంకేతిక బృందం:
స్క్రీన్‌ప్లే: మ‌ణికుమార్ చిన్నిమిల్లి
డైలాగ్స్‌: ఐ. ర‌వి
సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, అనంత శ్రీ‌రామ్‌, వెంగీ
మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్ర‌ఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
ఫైట్స్:  రియ‌ల్ స‌తీష్‌
కొరియోగ్ర‌ఫీ:  విశ్వ ర‌ఘు
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
కో-డైరెక్ట‌ర్‌:  సాయిర‌మేష్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌మేష్ మేడికొండ‌
నిర్మాత‌లు: ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌
బ్యాన‌ర్‌: శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్‌
వైద్య విద్యారంగంలో సంస్కరణలు
రాష్ట్రంలో తొలిసారి 16 కొత్త సర్కారీ మెడికల్‌ కాలేజీలు
అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌ కేర్, మెడికల్‌ టూరిజం ఉండేలా చర్యలు 
సర్కారీ వనంలో వైద్య సుమాలు 
ఒక్కో కాలేజీ 50 ఎకరాల్లో నిర్మాణం 
మచిలీపట్నం, అరకులో స్థలాలు సిద్ధం 
మిగిలిన 14 చోట్ల మొదలైన స్థలాల గుర్తింపు ప్రక్రియ




(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)
రాష్ట్ర చరిత్రలో వైద్య విద్యారంగంలో పెను మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ రంగంలోనే ఏకంగా 16 బోధనాస్పత్రుల్ని (మెడికల్‌ కాలేజీలు) నిర్మించేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య విద్యను ప్రైవేట్‌ పరం చేస్తున్న తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఓ వైపు ప్రజా సంక్షేమంతో పాటు మరోవైపు సామాజిక పెట్టుబడిలో భాగంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. గత చంద్రబాబు సర్కారు వైద్య విద్యారంగాన్ని ప్రైవేట్‌కు వదిలేసి ప్రైవేట్‌ రంగం చేయాల్సిన ఫైబర్‌ నెట్, సెటాప్‌ బాక్సుల ఏర్పాటు, టవర్స్‌ నిర్మాణం వంటివి ప్రభుత్వ రంగంలో చేపట్టగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్య విద్యా రంగాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవడం ద్వారా భావితరాలకు బాటలు వేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడే గత ప్రభుత్వ ఆలోచనలకు ఈ ప్రభుత్వ ఆలోచనలకు స్పష్టమైన తేడా కనిపిస్తోందని పేర్కొంటున్నాయి.



తండ్రి ఆశయాన్ని నెరవేర్చేలా:
 దివంగత సీఎం వైఎస్సార్‌ ఉమ్మడి ఏపీలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తరువాత వచ్చిన ప్రభుత్వాలు మెడికల్‌ కాలేజీల ఏర్పాటును పట్టించుకోకపోగా.. వైద్య విద్యా రంగాన్ని ప్రైవేట్‌ పరం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాయి.  ఇప్పుడు వైద్య విద్యారంగాన్ని  ప్రభుత్వ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయించి.. జిల్లాకో మెడికల్‌ కాలేజీ నిర్మించాలన్న తండ్రి ఆశయాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.  పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లా చేయాలనే ఆలోచనతోనే నియోజకర్గానికో మెడికల్‌ కాలేజీ నిర్మించేలా చర్యలు చేపట్టారు.

ఆగస్టులో టెండర్లు:
మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సంబంధించి డిజైన్ల రూపకల్పన, సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను రూపొదించే పనిలో యంత్రాంగం ఇప్పటికే నిమగ్నమైంది.  వీలైనంత త్వరగా డిజైన్లు, డీపీఆర్‌లను పూర్తి చేసి ఆగస్టులో టెండర్లు పిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కాలేజీల విస్తరణకు సైతం అవకాశం ఉండేలా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో బోధనాస్పత్రుల నిర్మాణం చేయనున్నారు.  మూడేళ్లలో వీటి నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధారించుకుంది.



అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్‌ కాలేజీలు:
బోధనాస్పత్రులకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలతో పాటు పారా మెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.  వీటిలో అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌కేర్, మెడికల్‌ టూరిజం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 2,050 మెడికల్‌ సీట్లు ఉండగా కొత్తగా నిర్మించే ఒక్కో బోధనాస్పత్రిలో 100 సీట్ల చొప్పున 1,600 సీట్లు రానున్నాయి.  రాష్ట్రంలో సుమారు 95% కుటుంబాలను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2,100 కోట్లను కేటాయించారు.  ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి ప్రభుత్వ రంగంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయనుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

50 ఎకరాల సువిశాల ప్రాంగణం ఉండేలా:
ప్రస్తుతం ఉన్న 11 బోధనాస్పత్రుల రూపురేఖలను మార్చడంతో పాటు రూ.12 వేల కోట్లతో కొత్తగా మరో 16 బోధనాస్పత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం.  ఒక్కో ఆస్పత్రిని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మచిలీపట్నం, అరకులో కాలేజీల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సిద్ధం చేశారు. నర్సారావుపేట, నంద్యాల, పులివెందుల, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం,  హిందూపూర్, రాజంపేట, అమలాపురం, నరసాపురం, బాపట్ల, మార్కాపురం, చిత్తూరులో కాలేజీలకు అనువైన స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.  ఇదిలావుంటే ఆదోనిలో మరో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ విషయంలోనూ అధికారిక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో నిర్మించే మొత్తం కాలేజీల సంఖ్య 17కు చేరుతుంది.

వైద్య విద్యకు మంచి రోజులు-డాక్టర్‌ కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు

ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, ప్రైవేట్‌ మెడికల్‌ సీట్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్‌ వైద్య కళాశాలల కంటే ప్రభుత్వ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వైద్య విద్య పేదవారికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు నిర్మించడమనేది బహుశా దేశ చరిత్రలో ఇక్కడే మొదటిసారి చేస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే స్పెషాలిటీ సేవలు పేదలందరికీ అందుబాటులోకి వస్తాయి.     


హ‌రీష్ శంక‌ర్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన‌ 'నాంది' 
ఎఫ్ఐఆర్‌ను ఆవిష్క‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌



(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
"ఒక మ‌నిషి పుట్ట‌డానిక్కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది. మ‌రి నాకు న్యాయం చెప్ప‌డానికేంటి సార్‌.. ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతోంది?".. ఇది 'నాంది' సినిమాలో అల్ల‌రి న‌రేష్ వేస్తున్న ప్ర‌శ్న‌. ఆ సినిమా ఇతివృత్తం ఏ లైన్ మీద ఆధార‌ప‌డిందో ఈ ఒక్క డైలాగ్ చెబుతోంది. జూన్ 30 హీరో అల్ల‌రి న‌రేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ 'నాంది' ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) టీజ‌ర్‌ను ఉద‌యం 9:18 గంట‌ల‌కు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఆవిష్క‌రించారు. 

టీజ‌ర్‌ను షేర్ చేస్తూ, "ప్ర‌పంచానికి ఈ టీజ‌ర్‌ను షేర్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. మొత్తం టీమ్‌కు నా శుభాకాంక్ష‌లు. అల్ల‌రి న‌రేష్ ఫెంటాస్టిక్‌గా క‌నిపిస్తున్నారు. హ్యాపీ బ‌ర్త్‌డే అన్నా" అని ట్వీట్ చేశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైన‌ టీజ‌ర్ ప్ర‌కారం అల్ల‌రి న‌రేష్ ఒక అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ అనీ, చేయ‌ని నేరానికి జైలు పాలై, న్యాయం కోసం అల‌మ‌టించిపోతున్నాడ‌నీ అర్థ‌మ‌వుతోంది. 2015 నాటికి దేశంలోని జైళ్ల‌న్నింటిలో 3,66,781 మంది ఖైదీలుంటే, వారిలో 2,50,000 మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలేన‌నీ, అంటే కోర్టులో శిక్ష‌ప‌డ‌ని ఖైదీలేన‌నీ ఈ టీజ‌ర్‌లో త‌న వాయిస్ ఓవ‌ర్ ద్వారా హ‌రీష్ శంక‌ర్‌ చెప్పారు. అలాంటి ఒక అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌. హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఆయ‌న‌ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 

ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది.



'నాంది' అల్ల‌రి న‌రేష్ న‌టిస్తోన్న 57వ చిత్రం. ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు పంచుతూ వ‌చ్చిన ఆయ‌న ఈ చిత్రంలో వాటికి పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ను చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. టీజ‌ర్‌లో చూపించిన దాని ప్ర‌కారం పోలీస్ స్టేష‌న్‌లో ఒక షాట్‌లో ఆయ‌న‌ పూర్తి న‌గ్నంగా క‌నిపించారు. దీన్ని బ‌ట్టి ఈ పాత్ర‌ను ఆయ‌న ఎంత ప్రేమించి ఉంటారో ఊహించ‌వ‌చ్చు. న‌టుడిగా అల్ల‌రి న‌రేష్‌లోని మ‌రో కోణాన్ని ఈ సినిమాలో మ‌నం చూడ‌బోతున్నాం.

వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లాయ‌ర్‌గా, హ‌రీష్ ఉత్త‌మ‌న్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా న‌టిస్తున్న‌ట్లు టీజ‌ర్ తెలియ‌జేస్తోంది.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని.

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌:  తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
సంగీతం:  శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ:  సిద్‌
ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఫైట్స్‌:  వెంక‌ట్‌
పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌:  రాజేష్ దండా
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌.
అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా...
'బంగారు బుల్లోడు' టీజ‌ర్ రిలీజ్‌


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న టైటిల్ రోల్ పోషిస్తోన్న 'బంగారు బుల్లోడు' సినిమా టీజ‌ర్ జూన్ 30 మ‌ధ్యాహ్నం 3:06 గంట‌ల‌కు విడుద‌ల‌య్యింది. పి.వి. గిరి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా అందాల తార పూజా ఝ‌వేరి న‌టిస్తోంది. 

ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్ ద్వారా 'బంగారు బుల్లోడు' చిత్రం ఆద్యంతం మ‌న‌ల్ని న‌వ్వుల్లో ముంచెత్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. కామెడీ టైమింగ్‌లో తాను కింగ్‌న‌ని మ‌రోసారి ఈ చిత్రంతో అల్ల‌రి న‌రేష్ నిరూపించబోతున్నారు. ఆయ‌న ఒక బ్యాంక్ ఉద్యోగి అనీ, ఆ బ్యాంక్ లాకర్‌లో ఉండే బంగారు న‌గ‌ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌నీ టీజ‌ర్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. స‌స్పెన్స్‌, సెంటిమెంట్ అంశాలు మేళ‌వించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.




తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, పూజా ఝ‌వేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్, స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, అజ‌య్ ఘోష్‌, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం, సారిక రామ‌చంద్ర‌రావు.

సాంకేతిక బృందం:
సాహిత్యం:  రామ‌జోగ‌య్య శాస్త్రి
సంగీతం:  సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వ‌ర్మ‌
ఆర్ట్‌:  ఎన్‌. గాంధీ
ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌
పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
నిర్మాత‌:  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  పి.వి. గిరి
బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌.
ప్రత్యేక జిల్లా...మెడికల్ కాలేజీ సాధన కోసం
హిందూపురం అఖిలపక్షం రంగంలోకి
ధర్నాలు, నిరసనలకు సన్నాహాలు
కరపత్రాలతో ప్రచారం
నిర్ణయించిన నేతలు


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపూర్ ప్రతినిధి)
హిందూపురం పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోరుతూ అఖిలపక్షం నేతలు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఇక ప్రత్యక్ష కార్యచరణలోకి దిగాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారంనాడు ఉదయం హిందూపురం అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పాండురంగ నగర్ లోని కనకదాసు కల్యాణ మంటపంలో సమావేశం జరిగింది. ఈరోజు సమావేశంలో  తమ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ కార్యచరణ దిశగా నిర్ణయాలు తీసుకొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక జిల్లా, మెడికల్ కాలేజీ సాధన కోసం లేపాక్షి , చిలమతూర్, హిందూపురం రురల్ మండలాలలో అఖిలపక్షం కమిటీ వేసి అసెంబ్లీలోని అన్ని మండలాలలో అధికారులకు వినతిపత్రం సమర్పించాలని, అలాగే ధర్నాలు చేయాలని తీర్మానించారు . అలాగే హిందూపురం అసెంబ్లీలోని అన్ని దుకాణాలలో వైద్య కలశాల, జిల్లా సాధన కోసం కరపత్రాలు, పోస్టర్లు అంటించి వీటి ఏర్పాటు ఆవశ్యతను ప్రజలకు తెలియజేయాలని వారు నిర్ణయించారు. అన్ని కుల సంఘాలు , వాణిజ్య వర్తక సంఘాలు , ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి చేత విడివిడిగా జిల్లా కలెక్టర్, మండల రెవిన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించాలని తీర్మానించడమైనది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ , కాంగ్రెస్ నాయకుడు బాలాజీ మనోహర్ , ముస్లిం నగారా నేత ఉమర్ ఫారూఖ్ ఖాన్, బీజేపీ నేత ఆదర్శ్ కుమార్ , కురుభ సంఘం అధ్యక్షులు చలపతి , ఓపీడిఆర్ నేత శ్రీనివాసులు , , బీఎస్పీ నేత శ్రీరాములు , క్లాత్ మెర్చంట్స్ నేత దాసా సందేశ్ , ఎమ్మార్పీఎస్ నేత నాగార్జున , చైతన్య గంగిరెడ్డి , టీడీపీ నాయకులు డి.ఇ. రమేష్ , రఘు , చంద్రమోహన్ , కాంగ్రెస్ నాయకులు నగరాజ్ , జమీల్ .నాజీమ్ తదితరులు పాల్గొన్నారు. 
కరోనా ఎఫెక్ట్
తగ్గిన టోల్ ప్లాజా ఆధాయం
ఆధాయం పెంపుదలకు అధికార్ల కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త టోల్ ‌ఫ్లాజాలు
తద్వారా నష్టాన్ని పూడ్చుకొనే యోచన...?


(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. అన్ని రంగాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నాయి. ఇందుకు టోల్ ప్లాజాలు మినహాయింపు కాలేదు. గతంలో కంటే భారీ ఎత్తున్న టోల్ ప్లాజాలు కోల్పోయాయి. దీంతో జరిగిన నష్టాన్ని భర్తీచేసుకోవడంపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తాజాగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగినా గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులువుకాదని భావించిన అధికార్లు ఆధాయం పెంపుపై వినూత్న ఆలోచన చేసినట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో అవి 20కి చేరుకోనున్నాయి. మాములుగా టోల్‌ఫ్లాజాల ద్వారా నెలకు రూ.80 నుంచి 90 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 50 రోజులకు పైగా ఆదాయం పడిపోయింది. అయితే లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో వాహనాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టోల్‌ప్లాజాల వద్ద ఆదాయం పెరిగింది. మే నెలలో సుమారు రూ.59 కోట్లు, జూన్ నెలలో (21వ తేదీ వరకు) రూ.55.6 కోట్ల ఆదాయం టోల్‌ప్లాజాల ద్వారా సమకూరిందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఈ రెండు ప్లాజాలు ప్రారంభమయితే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పేర్కొన్నారు. టోల్‌ప్లాజాలను విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల అథారిటీ సంస్థ) ప్రణాళికలను రూపొందించింది.



అందులో భాగంగా టోల్‌ప్లాజా ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా నిర్మించబోయే రెండు టోల్‌ప్లాజాల్లో ఒకటి స్టేషన్ ఘన్‌పూర్ వద్ద (వరంగల్ జాతీయ రహదారి 163పై నిర్మాణం జరుగుతుండగా మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ వద్ద నిర్మాణం జరుపుతున్న టోల్‌ప్లాజాల వద్ద ఆరు నుంచి ఎనిమిది గేట్లను ఏర్పాటు చేస్తుండగా, ఆర్‌ఎఫ్‌ఐడి ఆథారిత ఫాస్టాగ్ గేట్లను నిర్మిస్తున్నారు. రానున్న సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో రూ.11.66 కోట్లు రాష్ట్రంలోని 18 టోల్‌ఫ్లాజాల (ఫాస్టాగ్‌ల) ద్వారా సమకూరింది. ప్రతి నెల 18 టోల్‌ప్లాజాల ద్వారా సుమారు నెలకు రూ.80 నుంచి రూ. 90 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
సింగారమొలికిస్తూ 
సమ్మోహనపరిచే లఘు చిత్రం
సింగార మోహన్ 
'ఏ డేట్ ఇన్ ది డార్క్'



(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
      నాలుగ్గోడల మధ్య బంధిస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది అన్నట్లు.. పరిమితులనే నాలుగ్గోడల మధ్య బందీ అయిన సృజనాత్మకత సరి కొత్త పుంతలు తొక్కుతుంది అని చెప్పడానికి తాజా ఉదాహరణ 'సింగార మోహన్'.
     దర్శకుడవ్వాలన్నది ఈ కుర్రాడి కల. కానీ ఇంట్లో సిట్యుయేషన్ సహకరించని పరిస్థితి. ఆ దిశగా ప్రయత్నాలు చేసేందుకు కనీసం హైదరాబాద్ వచ్చేందుకు కూడా వీలు కానీ వింత స్థితి. అయినా సరే.. తనలో ఉన్న 'డైరెక్టర్ మెటీరియల్' ను ఘనంగా ప్రకటించుకోవాలనే అతని వజ్ర సంకల్పానికి.. అతనిలో ఉన్న సృజనాత్మకత జత సాలిసింది.
     తన మేధస్సే పెట్టుబడిగా.. జీరో బడ్జెట్ లో 'డేట్ ఇన్ ది డార్క్' అనే  వర్చ్యువల్ ఆడియో షార్ట్ ఫిలిం రూపొందించి 'ఎవరీ సింగార మోహన్' అని అందరూ తనపై దృష్టి సారించేలా చేసుకున్నాడు.
     ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక ఇంజినీరింగ్ మధ్యలోనే డిస్కంటిన్యూ చేసిన మోహన్.. ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ గా పని చేస్తూ.. 'ఈ లెర్నింగ్ ' కి సంబంధించిన స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కడప జిల్లా 'కలసపాడు' సింగార మోహన్ స్వస్థలం.
     'డేట్ ఇన్ ది డార్క్' గురించి మోహన్ మాట్లాడుతూ... '2020లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లి.. ఫిలిం మేకర్ గా మారేందుకు ప్రయత్నాలు చేయాలి అని ఫిక్స్ అయి.. అందులో భాగంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ సొంతంగా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో 'కరోనా' దాపురించింది. దాంతో.. కోవిడ్ నిబంధనలకు కట్టుబడి.. ఏ డేట్ ఇన్ ది డార్క్' అనే వర్చ్యువల్ ఆడియో షార్ట్ ఫిలిం (వాస్తవిక శ్రవణ లఘు చిత్రం) తీశాను. అయితే దీనికి ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు. ముఖ్యంగా ప్రముఖ లాయర్- యాక్టర్ జయశ్రీ రాచకొండ గారు ఈ షార్ట్ ఫిలింని ఎంతో మెచ్చుకుంటూ పేస్ బుక్ లో షేర్ చేశాక మరింత రీచ్ పెరిగింది' అన్నారు. ఈ షార్ట్ ఫిలిం కోసం వాయిస్ ఇచ్చి, జీవం పోసిన ద్రోణ శ్రీనివాస్, అలేఖ్య పట్వారీలకు మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. తిరుపతిలో ఉండే ద్రోణ శ్రీనివాస్, హైదరాబాద్ లో ఉండే అలేఖ్య పట్వారి ఇద్దరూ మెడికోస్ కావడం ఇక్కడ గమనార్హం. సుజీత్, శివ నిర్వాణ, ప్రశాంత్ వర్మ, సంకల్ప్ రెడ్డి వంటి నేటి లీడింగ్ దర్శకులంతా.. షార్ట్ ఫిలిమ్స్  ద్వారా తమ టాలెంట్ నిరూపించుకున్నవాళ్ళేనని తెలిసిందే. పది  నిమిషాల 'ఏ డేట్ ఇన్ ది డార్క్' చూసినవాళ్లంతా...  పై జాబితాలో 'సింగార మోహన్' పేరు చేరడం ఖాయమనే అభిప్రాయంతో నిస్సంకోచంగా ఏకీభవిస్తారు!!
సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ
ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర అస్వస్థత
ఆరా తీసిన సీఎం
ఆందోళన అవసరంలేదన్న అధికార్లు



(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన మరువక ముందే పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అర్థరాత్రి రియాక్టర్‌ నుంచి బెంజిన్‌ మెడిజోన్‌ గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌ రావి నరేంద్ర(33)), కెమిస్ట్‌ గౌరీశంకర్‌(26) మృతిచెందారు. చంద్రశేఖర్‌, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం గాజువాక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ లోపలికి మీడియాను అనుమతించడంలేదు. కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షల నష్ట పరిహారం చెల్లించడంతో పాటు కంపెనీ యజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.


ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం: సీపీ
సాయినార్‌ కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీపీ ఆర్‌కే మీనా తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఘటనలో మృతి చెందిన షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి నరేంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి, కెమెస్ట్‌ గౌరీశంకర్‌ విజయనగరానికి చెందిన వ్యక్తి అని సీపీ వివరించారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందారని సీపీ తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నామని వెల్లడించారు.


ప్రమాదంపై సీఎం ఆరా
విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మ«ధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటననే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లాకలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్‌ వినయ్, , విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారని తెలిపారు. ఈఘటనపై విచారణకూడాచేయిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారన్నారు. 
 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు


(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి) 
దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.21 సమయంలో సెన్సెక్స్‌ 182 పాయింట్లు లాభపడి 35,143 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 10,373 వద్ద కొనసాగుతున్నాయి. దేశంలో అన్‌లాక్‌2 మొదలవుతోందని ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాపార కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. దీంతో మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి.  దీనికి సంబంధించి ప్రధాని మోదీ నేటి సాయంత్రం మాట్లడనుండటంతో మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు నేడు ట్రాయ్‌ మొబైల్‌ సబ్‌స్క్రైబర్‌ డేటాను విడుదల చేయనుంది.  నిన్న అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగా మగియడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై పడింది. డోజోన్స్‌ 2.3, ఎస్‌అండ్‌పీ 500 1.47, నాస్‌డాక్‌ 1.2శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు కూడా  లాభాల్లో ఉన్నాయి. 
నేడు మొత్తం 596 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటిల్లో వోడాఫోన్‌ ఐడియా, ఓఎన్‌జీసీ, సెయిల్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.
టిక్ టాక్....మాయం
గూగుల్ ప్లే స్టోర్...ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి 'టిక్‌టాక్'‌ మాయం
కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో చర్యలు
గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు ఉత్తర్వులు
29వ రాత్రి వరకు కనపడిన టిక్‌టాక్‌
30వ తేదీ ఉదయం నుంచి మాయం



(జానోజాగో వెబ్ న్యూస్-బిజినేస్ ప్రతినిధి)
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశానికి బుద్ధి చెప్పాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన ముఖ్యమైన 59 మొబైల్‌ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. భారతీయులు అధికంగా వాడుతోన్న టిక్‌టాక్ కూడా ఈ జాబితాలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అధికారులు గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు ఉత్తర్వులను పంపారు.
దీంతో భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి వాటిని తొలగించారు. నిన్న రాత్రి వరకు అవి అందులో కనపడగా, నేటి ఉదయం నుంచి మాయం కావడం గమనార్హం. ఆయా స్టోర్లలో ప్రస్తుతం టిక్‌టాక్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఆ యాప్‌ కనపడట్లేదు. భారత సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు వంటి వాటికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద ఈ యాప్స్‌ను నిషేధించారు.
నిషేధంపై స్పందించిన టిక్ టాక్ ఇండియా యాజమాన్యం!
నిబంధనలన్నీ పాటిస్తున్నాం


చైనా సహా ఏ ప్రభుత్వానికీ సమాచారం ఇవ్వలేదు-
టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ
టిక్ టాక్ తో పాటు మరో 58 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా స్పందించింది. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేసింది. "భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.
దేశంలో 17వేల‌కు చేరువ‌లో క‌రోనా మ‌ర‌ణాలు
గడిచిన 24గంట‌ల్లో 18,522 కేసులు, 418మ‌ర‌ణాలు
స్వయం కట్టడియే మార్గం


(జానోజాగో వెబ్ న్యూస్- స్పెషల్ డెస్క్)
కరోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్నిరోజులుగా భార‌త్‌లో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,522 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మంగ‌ళ‌వారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల‌ సంఖ్య 5,66,840కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 16,893మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,34,821మంది కోలుకోగా మ‌రో 2,15,125 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలి‌పింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్నవారి శాతం 58.6గా ఉంది. ఈ సంద‌ర్భంలో దేశ‌వ్యాప్తంగా కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో జులై 31వ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
కొవిడ్‌19 తీవ్ర‌త అధికంగా ఉన్న‌ మ‌హారాష్ట్రలో 1,69,883 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 7610మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజ‌ధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 85,161కి చేర‌గా 2680మంది చనిపోయారు. త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌ల‌లో మ‌ర‌ణాల సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. గుజ‌రాత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1827 మంది క‌రోనా సోకినవారు చ‌నిపోగా, త‌మిళ‌నాడులో ఈ మ‌ర‌ణాల సంఖ్య 1141కి చేరింది. దేశంలో వైర‌స్ తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను కూడా భారీగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో దాదాపు 84ల‌క్ష‌ల శాంపిళ్లకు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి వెల్ల‌డించింది.

ఇక ప్ర‌పంచంలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదౌతున్న దేశాల జాబితాలో భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌ర‌ణాల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇదిలాఉంటే, దేశంలో నెల‌కొన్న‌ తాజా ప‌రిస్థితుల‌పై ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోదీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.
బస్సు టిక్కట్ల కోసం...
ఎపీఎస్ ఆర్టీసీ ప్రథమ్ యాప్


(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి) 
ప్రథమ్’ పేరుతో కొత్త యాప్ ను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు టికెట్ల కోసం కొత్త యాప్‌ను వినియోగించనుంది. తొలుత విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో పరిధిలో ఈ యాప్‌ ద్వారా టికెట్ల జారీని చేపట్టాలని భావించినా.. ఇప్పుడు పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ ఈ యాప్‌నే వాడాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. దీనికి ‘ప్రథమ్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది చూపిస్తుంది. అప్పుడు బస్సును ఎంపిక చేసుకుని టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలి. టికెట్‌ జారీ అయినట్లు మెసేజ్‌తోపాటు 4 అంకెల పిన్‌ నంబరు వస్తుంది. ప్రయాణికుడు బస్‌ ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్‌ నంబరు చెబితే సరిపోతుంది.
కుయ్.. కుయ్ కు...కొత్త హంగులు
ఆధునాతన వైద్య సంకేతికతతో రోడ్డుపైకి
ప్రజా ఆరోగ్యంపై వై.ఎస్.జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద
అంబులెన్స్‌ వ్యవస్థకు జవజీవాలు 
వాహనాల కొనుగోలుకు రూ.203.47 కోట్ల
అందుబాటులో వెంటిలేటర్, ఇన్‌ఫ్యూజన్‌ పంప్స్, సిరంజి పంప్స్‌ 
కొత్తగా చిన్నారుల కోసం 26 నియోనేటల్‌ అంబులెన్స్‌లు
బాధితులకు భరోసా ఇచ్చేలా 108, 104 వ్యవస్థలు
రోడ్డెక్కేందుకు 104,108 కొత్త వాహనాలు సిద్దం
జూలై 1న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి



(జానోజాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రత్యేక ప్రతినిధి)
ప్రజల కోసం దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 104, 108 మొబైల్ అంబులెన్స్ వ్యవస్థను ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరింత పట్టిష్టంచేస్తున్నారు. రాష్ట్రంలో అంబులెన్స్‌ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసే చర్యలు తీసుకొన్నారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు వీలుగా ఈ  108, 104 అంబులెన్స్‌ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. ఈ నేపథ్యంలో జులై ఒకటో తేదీన కొత్త అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వీటితో పాటు సంచార వైద్య శాలలుగా చెప్పుకునే 104 వాహనాలు పల్లెలకు సగర్వంగా తలెత్తుకుని వెళ్లనున్నాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే 108 వాహనాలతో పాటు పల్లె ప్రజలకు వైద్యం అందించడానికి మండలానికొక 104 వాహనం వెళ్లనుంది. జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పాటు, రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా చిన్నారుల కోసం నియోనేటల్‌ కేర్‌ అంబులెన్స్‌లు సైతం రోడ్డు మీదకు రానున్నాయి.


ఎన్నెన్నో ప్రత్యేకతలు

పల్సాక్సీ మీటర్‌:
ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ అంటే శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని చూడటంతో పాటు పల్స్‌ రేటు చూపిస్తాయి.

మల్టీపారా మానిటర్‌:
ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు.

ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌:
కొత్త వాహనాల్లో ఆక్సిజన్‌తో కూడిన ట్రాన్స్‌ పోర్ట్‌ వెంటిలేటర్‌ ఉంటుంది. బాధితుల పరిస్థితి. విషమంగా ఉండి, శ్వాస తీసుకోలేని సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ను ఉపయోగిస్తారు.

సక్షన్‌ ఆపరేటర్‌:
ప్రమాదంలో గాయపడినప్పుడు ఊపిరితి త్తుల్లో నిమ్ము, లేదా రక్తం చేరినప్పుడు ఆ తేమను లాగేం దుకు ఈ సక్షన్‌ ఆపరేటర్‌ ఉపయోగపడుతుంది.

ఫోల్డబుల్‌ స్ట్రెచర్స్‌:
గతంలో ఇవి లేవు. తాజాగా తెచ్చారు. స్ట్రెచర్‌ను పూర్తిగా మడత పెట్టి తీసుకెళ్లొచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది.

సిరంజి పంపు:
ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి ఐవీ ఫ్లూయిడ్స్‌ లేదా, ఇంజక్షన్లు ఎక్కించాల్సి వచ్చినప్పుడు టైమ్‌ను సెట్‌చేస్తే ఆ టైము ప్రకారం ఇది ఎక్కిస్తుంది.



గతానికి భిన్నంగా 104 వాహనాల్లో సేవలు ఇలా:
గతానికీ ఇప్పటికీ ఈ మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను పూర్తి భిన్నంగా నిర్వ హించనున్నారు. ఇకపై ప్రతి పల్లెకూ నెలలో ఒకరోజు విధిగా వెళ్లాల్సిందే. మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది.  ప్రతి 104 వాహనం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది. ఆ పీహెచ్‌సీ పరిధిలోకి వాహనం వెళ్లినప్పుడు పీహెచ్‌సీ సిబ్బంది లేదా ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది కూడా విధిగా వాహనం వద్దకు రావాల్సిందే. వాహనంలో డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. మొత్తం 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. 20 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. గతంలో 52 రకాల మందులు (అవి కూడా ఉండేవి కావు) ఉండగా ఇప్పుడా సంఖ్యను 74కు పెంచారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేస్తారు. ఒకే రోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సినప్పుడు ఉదయం ఒక గ్రామానికి, సాయంత్రం మరో గ్రామానికి వాహనం వెళుతుంది. ప్రతి వాహనం విలేజి క్లినిక్‌కు కూడా అనుసంధానమై ఉంటుంది. గతంలో 104 వాహనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కిలోమీటర్లు ఆవల ఉన్న పల్లెలకు మాత్రమే వెళ్లేవి. చాలా చోట్ల నిర్వహణ సరిగా లేక నిర్ణయించిన మేరకు కూడా పల్లెలకు వెళ్లేవి కావు.

నియోనేటల్‌ అంబులెన్స్‌లు : గతంలో ఎప్పుడూ ఇలాంటి అంబులె న్స్‌లు ఏ ప్రభుత్వమూ నిర్వహించ లేదు. దేశంలో కూడా ఒకటీ లేదా రెం డు రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని అందుబా టులో ఉన్నాయి. ఏపీలో 26 నియోనే టల్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఒక రోజు వయసున్న పిల్లల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రమాదం జరిగితే ఈ అంబులెన్స్‌లు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన సేవలందిస్తాయి.  కొన్ని రకాల సౌకర్యాలు గతంలో ఉన్నా వాటిని నిర్వ హించక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయేవారు
చిన్న పరిశ్రమలకు పునర్జీవం
ఊతమిస్తున్న వైసీపీ ప్రభుత్వ చర్యలు
ఎంఎస్‌ఎంఈ బకాయిలను పూర్తిస్థాయిలో తీర్చిన ఏకైక రాష్ట్రం ఏపీ
ప్రభుత్వ రాయితీలు, రుణాలతో పుంజుకున్న కార్యకలాపాలు 
ఇప్పటివరకు 78,634 ఎంఎస్‌ఎంఈలు కొత్త రుణాల కోసం దరఖాస్తు
వెంటిలేటర్లపై ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఆక్సిజన్‌ ఇచ్చారంటున్న పారిశ్రామికవేత్తలు



(జానోజాగో వెబ్ న్యూస్-బిజినేస్ ప్రతినిధి)
గత కొన్నేళ్లుగా దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంధ్యం పైగా ఇటీవల కరోనా వైరస్ దూకుడుతో ఇక దేశ వ్యాప్తంగానున్న చిన్ని పరిశ్రమల తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ ఈ పరిశ్రమలకు తిరిగి ఊపరిపోసే చర్యలు చేపట్టింది. పదేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు రాష్ట్రంలో తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునే విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టినప్పటి నాటినుంచీ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బ్యాంకు రుణాలను చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిపోయిన యూనిట్లను ఆదుకోవడానికి ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు లేక, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని రక్షించేందుకు తక్షణం రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీలతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సిన రాయితీలు కలిపి రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న ఎంఎస్‌ఎంఈలకు ఆక్సిజన్‌ అందించినట్టయ్యిందని పారిశ్రమికవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఏపీ ప్రభుత్వం ఒక్క ఏడాది బకాయి కూడా లేకుండా చెల్లించిదంటున్నారు.



ప్రయోజనాలు కల్పించారిలా
రూ.188 కోట్ల స్థిర విద్యుత్‌ డిమాండ్‌ చార్జీల భారాన్ని మాఫీ చేయడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం రూ.200 కోట్లు కేటాయించడం, ప్రభుత్వ శాఖలు చేసే కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంఎస్‌ఎంఈలకు కొండంత భరోసానిచ్చింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 78,634 యూనిట్లకు రూ.2,079.23 కోట్ల రుణాన్ని మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 33,574 యూనిట్లకు రూ.1,269.91 కోట్ల రుణాలు అందించారు.

పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ : రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలను నిరంతరం పర్యవేక్షించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎంఎస్‌ఎంఈలకు పరిశ్రమ ఆధార్‌ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో డేటాబేస్‌ను తయారు చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ఏపీఐఐసీ ప్లగ్‌ అండ్‌ పే విధానంలో వినియోగించుకునే విధంగా 31 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
అమ్మాయిలకు గుడ్ న్యూస్...
డీఆర్‌డీఓ నుంచి రూ.1,86,000 స్కాలర్‌షిప్
జులై 19న ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
సెప్టెంబర్ 30న ధరఖాస్తుకు చివరి తేదీ


(జానోజాగో వెబ్ న్యూస్-స్పెషల్ డెస్క్)
విద్యార్థినులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయొచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది డీఆర్‌డీఓ. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు డీఆర్‌డీఓకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్- ఆర్ ఏసీ వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. భారతదేశానికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయాలి.



బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలకు 20 స్కాలర్‌షిప్స్ కేటాయించింది డీఆర్‌డీఓ.  జెఈఈ మెయిన్‌ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న అమ్మాయిలకు 10 కేటాయించింది డీఆర్‌డీఓ. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులతో పాటు గేట్ స్కోర్ ఉండాలి. ఎంపికైనవారికి వార్షిక కాలేజీ ఫీజు లేదా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ రూపంలో అందిస్తుంది డీఆర్‌డీఓ. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,20,000 వరకు నాలుగేళ్లు, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థినులు ఏటా రూ.1,86,000 వరకు రెండేళ్లు స్కాలర్‌షిప్ పొందొచ్చు.
విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అడ్మిషన్ పొంది ఉండాలి. స్కాలర్‌షిప్ కోసం ఎంపికైనవాళ్లు డీఆర్‌డీఓ, ప్రభుత్వ ల్యాబరేటరీస్ లేదా AR&DB నిధులతో నడుస్తున్న సంస్థల్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించిన విద్యార్థినులు అన్ని పరీక్షల్లో పాస్ కావాలి.

వైఎస్సార్ చేయూత మరింత సరళం
లబ్ధిదారులకు అనుకూలంగా విధానాల మార్పు
కుల ధ్రువీకరణ పత్రం లేకుండానే...
మైనార్టీలకు చేయూత


(జానోజాగో వెబ్ న్యూస్-స్పెషల్ డెస్క్)
ముస్లిం, మైనార్టీ వర్గాల మహిళలు 'వైఎస్సార్ చేయూత' ఆర్థిక సహా యానికి దరఖాస్తు చేసుకునేందుకు వారి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు నిస్తూ ప్రభుత్వం ఈ జూన్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనా ర్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగేళ్లలో దశల వారీగా రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  వైఎస్సాఆర్  పెన్షన్ కానుక పథకంలో లబ్ధి చేకూరని వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. వైఎస్సార్ చేయూత పథకం మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బీసీ-ఈ ముస్లింలకు, బీసీ-బీ (దూదేకుల) ముస్లింలకు మాత్రమే కుల ధ్రువీకరణ పత్రం లభిస్తోంది. ఇతర మైనార్టీ వర్గాలకు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకునే అవకాశం తక్కువ. వారికి ఆ పత్రం తీసుకొనే అవసరమే రాలేదు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల వారు కుల ధ్రువీకరణ పత్రం సమ ర్పించడంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆయా సామాజిక వర్గాల వారికి ధ్రువీకరణ పత్రాల నుంచి మినహాయింపు నిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు.  ముస్లిం, మైనార్టీ సంక్షేమ శాఖ వివిధ సంక్షేమ పథకాల అమలులో అనుసరించే నిబంధనలు, విధి విధానాల మేరకు వైఎస్సార్ చేయూత పథకంలోనూ వ్యవహరించాలని ఉత్తర్వు లలో పేర్కొన్నారు. 
మెడికల్ కాలేజీ...హిందూపురం పట్టణ కేంద్రంగా జిల్లా చేయాలి
జలసాధన సమితి డిమాండ్
స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు వినతి


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
హిందూపురం పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతోపాటు పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని జలసాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ సెక్రటరీ బాలాజీకి ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు, జలసాధన సమితి ఉపాధ్యక్షులు చైతన్య గంగిరెడ్డి, ఉమర్ ఫారుక్ ఖాన్, బి.ఎస్.పి.శ్రీరాములు, జిల్లా ప్రచార కార్యదర్శి జమీల్ తదితరులు వినతి పత్రం అందజేశారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ ను వెడల్సు చేయాలని, పందిపర్తి వద్ద హంద్రీనివా కాలువకు రిజర్వాయర్ నిర్మించాలని, చిలమత్తూరు మండలానికి హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు. హిందూపురం పట్టణానికి దగ్గర ఉన్న మలుగూరు వద్ద 30 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మించినున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారని వారు పేర్కొన్నారు. అంతలోనే ఈ మెడికల్ కాలేజీ పెనుకొండ ప్రాంతానికి మెడికల్ కాలేజీ పోయిందని, అక్కడ స్థల పరిశీలన సాగుతున్నట్లు కథనం వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ హిందూపురంపట్టణానికే వచ్చేలా, హిందూపురం పట్టణ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యేలా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో నేరుగా ఎమ్మెల్యే చర్చించాలని వారు కోరారు. కృష్ణా జల్లాలు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తొమ్మిది నెలలు పారినా మండకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా హిందూపురంలోని కొన్ని చెరువులు మాత్రమే నిండాయని, చాలా చెరువులు నిండలేదన్నారు. అన్ని చెరువులు నిండాలంటే మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పెంచడమే మార్గమని వారు పేర్కొన్నారు. ఈ దిశగాచర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఏం వాదిస్తున్నారు 'వ‌కీల్‌సాబ్' 
పవన్ సినిమాకు లీకుల బెడద
సినిమా ప్రారంభంలో పవన్ లుక్ లీక్‌
పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్న లుక్‌ తాజాగా లీక్
పోస్టర్‌లో నటి అంజలి కూడా


(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యువతలో అత్యంత క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్ హై స్టేజ్ లో ఉన్నపుడే ఆయన రాజకీయ రంగ ప్రవేశంచేశారు. ఇక ఆయన సినిమాలకు దూరమా అంటే అవునని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. కానీ అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటిస్తున్నారు...ఆ సినిమా ఎవరితో...టైటిల్ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తికర చర్చ సాగుతుండగానే ఆయన తీసే సినిమా పేరు  'వ‌కీల్‌సాబ్' అని వెల్లడైంది. అదిరే సినిమా టైటిల్ బయటకు రావడంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తికరచర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ నటిస్తోన్న 'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్‌లో పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్లు ఇందులో ఉంది.       
ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వాదనలు వినిపిస్తుండగా పక్కనే నటి అంజ‌లి కూర్చొని ఉంది. కోర్టులో వాదనలు వినడానికి వచ్చిన మరి కొందరూ ఇందులో కనపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా,  బాలీవుడ్ సినిమా 'పింక్‌'కు రీమేక్‌గా వకీల్ సాబ్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. అంజ‌లితో పాటు నివేదా థామ‌స్  ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తయింది.
అభివృద్ధి పథంలో టీఎస్ దూసుకుపోతుంది
రైతులను ఆదుకునేందుకు మేము ఏ ప్పుడైన సిద్దం
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటం
కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం
మంత్రి కేటీఆర్ వెల్లడి
హుజూర్ నగర్, గర్లలో పాలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన



(జానోజాగో వెబ్ న్యూస్-ఉమ్మడి నల్గొండ బ్యూరో)
సూర్యాపేట జిల్లాలో మంత్రి కె. టి.ఆర్  పర్యటన చేశారు. మంత్రి   హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు అందులో భాగంగ కొత్తగా ఏర్పడిన హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కు ఆర్.డి.ఓ అఫిస్ ను ప్రారంభించారు.తరువాత అర్బన్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాగంగా హుజుర్ నగర్ లో రూ.50కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాను 30 జిల్లాలు గా ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కే. సి.ఆర్ ది అని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విదంగా రైతులకు నిరంతరం విద్యుత్ సరపారా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.హుజుర్ నగర్ లో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు పడే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.



 చెరువులు, కుంటలు, అటవీ భూములు  కబ్జాకు గురవుతున్నాయని స్థానిక ఎం.ఎల్ .ఏ తెలిపారని వాటిపై వెంటనే చర్య తీసుకుంటామని తెలిపారు. హుజుర్నగర్ అభివృద్ధి కి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్, ఎమ్మెల్యేలు  సైదిరెడ్డి,  గాదరి కిషోర్ కుమార్, భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్,, , ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి,, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్  దీపికా, మాజీ ఎమ్మెల్సే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  వేమిరెడ్డి నరసింహ రెడ్డి, పాల్గొన్నారు.


ఇస్లాం పాలన అంటే ఇది
ప్రజల మధ్య సమానత్వం...సమాజ పురోగతి
హరూన్, మామున్ ఇస్లామిక్ స్వర్ణ యుగంలో పరిపాలకులు


రచయిత-ముహమ్మద్ అజ్గర్ అలీ
రాజనీతి తత్వ శాస్త్ర అధ్యాపకులు 
రాజనీతి శాస్త్ర  శాఖాధిపతి(Rtd.) తెనాలి.
సెల్ నెం-94915-01910



ఇస్లామీక్ దేశాల పరిపాలనపై నేటికీ యావత్తు ప్రపంచానికి చాలా అపోహలు ఉన్నాయి. దీంతో ఇస్లాం పాలన చాలా క్రూరత్వంతో ఉంటుందన్న భావన నేటీ సమాజంలో పెంచిపోషించారు. వాస్తవానికి ఇస్లాం పాలన అంటే ప్రజలకు ఓ స్వర్ణయుగం అని చెప్పాలి. ప్రజలంతా ఒక్కటే అనడంతోపాటు సమాజ పురోగతికి పునాది వేసేది ఇస్లాం షరియత్ పాలన. అలాంటి పాలన ఎలా ఉంటుందో హరూన్, మామున్ లు తమ పరిపాలనలో చేసి చూపించారు. వారి పాలన నేటీ పాలకులకు ఎంతో ఆదర్శం

ఇస్లామిక్ నాగరికత తూర్పు, పశ్చిమం నుండి కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచినది. ముస్లింలు ఈ ఆలోచనలను తీసుకున్నారు, వాటిని ఇస్లామికరించారు. అందులో ఇస్లామిక్ కళ, వాస్తుశాస్త్రం, ఖగోళ శాస్త్రం, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్, మ్యూజిక్, తత్వశాస్త్రం, నైతికశాస్త్రం ఉన్నాయి.  ఫిక్హ్ ప్రక్రియ, సామాజిక సమస్యలకు వాటి ఉపయోగం చాలా కాలంగా అమలులో ఉంది. 

హారూన్ అల్-రషీద్ (ఆంగ్లము : Hārūn al-Rashīd) (అరబ్బీ మరియు పర్షియన్ : هارون الرشيد ); ఇంకనూ హారూన్ అర్-రషీద్, హారూన్ అల్-రాషిద్, హారూన్ రషీద్ అని కూడా పిలుచుతారు. ఇతను 786 లో ఇరవై రెండు ఏళ్ళ యువకుడిగా సింహాసనాన్ని అధిష్టించాడు.వెంటనే అంతర్గత తిరుగుబాటులు, బాహ్య దాడిని ఎదుర్కొన్నాడు. ఆఫ్రికాలో ప్రాంతీయ తిరుగుబాటులు అణిచివేయ బడ్డాయి. ఈజిప్ట్ లోని  క్వైస్, క్వజాల నుండి గిరిజన తిరుగుబాట్లు, అలావిస్ నుండి సెక్టారియన్ తిరుగుబాట్లు నియంత్రించబడ్డాయి. బైజాంటైన్స్ సంధికి  అంగికరించి కప్పం కట్టసాగరు.



తదుపరి 23 సంవత్సరాలు అతను అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు చైనా, భారతదేశం,  బైజాంటియమ్ సరిహద్దులతో కూడిన ఒక విశాలమైన మహా సామ్రాజ్యాన్ని పాలించాడు. అతని సామ్రాజ్యం లో ఆలోచనలు కాంటినెంటల్ విభేదాలు లేకుండా అంతటా స్వేచ్ఛగా ప్రవహించ సాగాయి. హురాన్ సామ్రాజ్యం ఒక అద్భుతమైన నాగరికత యొక్క ప్రతిబింబం. ఇతను 786 నుండి 809 వరకు పాలించాడు, ఇతని కాలంలో శాస్త్రీయ, సాంస్కృతిక, ధార్మిక విషయాలు ఉత్థాన దశలో వుండేవి. ఇతడి దూరదృష్టివలన కళలు, సంగీతం మున్నగునవి అభివృద్ధి చెందాయి. ఇతను ఓ పెద్ద గ్రంథాలయం బైతుల్ హిక్మాను స్థాపించాడు.


ప్రఖ్యాతమైన వెయ్యిన్నొక్క రాత్రులు అరేబియన్ నైట్స్ గ్రంధం  ఇతడి ప్రాశస్తాన్ని కొనియాడుతూ వ్రాయబడింది. హారూన్ రషీద్ కాలంలో బాగ్దాదు బాగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలూ అభివృద్ధికి నోచుకున్నాయి. ఖలీఫాల రాజధానిగా మారడంతో నిర్మాణాలు, కళలూ, జీవనశైలీ, అత్యాధునిక శాస్త్రాలు జీవం పోసుకున్నాయి. అది ఇస్లాం యొక్క స్వర్ణయుగం. అతని సామ్రాజ్య గొప్పతనం మానవ మేధాశక్తి,, నూతన ఆలోచనల ఆవిష్కారం గా ఉంది. సామ్రాజ్యం వృద్ధి చెందడంతోదానికి   సంప్రదాయ గ్రీకు, భారతీయ, జొరాస్ట్రియన్, బౌద్ధ, హిందూ నాగరికతల నుండి వచ్చిన ఆలోచనలతో సంబంధం ఏర్పడింది. అల్ మన్సూర్ కాలం లో ప్రారంభమైన  శాస్త్ర గ్రంథాల అనువాదం హరున్, మమున్ కాలం లో ఊపు అందుకొన్నది. హారూన్ బైత్ ఉల్ హిక్మా (జ్ఞానం యొక్క ఇల్లు) అనువాదం యొక్క పాఠశాలను స్థాపించాడు, జ్ఞానులతో సానిహిత్యం పెంచుకొన్నాడు.   అతని పరిపాలన అసాధారణమైన పరిపాలనా సామర్థ్యాలు గల బెర్ముసైడ్స్ వజీర్ల చేతిలో ఉంది. అతని ఆస్థానం లో గొప్ప న్యాయశాస్త్రవేత్తలు,  వైద్యులు, కవులు, సంగీతకారులు, తర్కవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, రచయితలు, శాస్త్రవేత్తలు, సాహిత్య, సాంస్కృతిక  వేత్తలు, ఫిఖ్ యొక్క పండితులు ఉన్నారు. రసాయన  శాస్త్రాన్ని కనుగొన్న ఇబ్న్ హేయాన్ (815) అతని ఆస్థాన శాస్త్రవేత్త. అనువాదంలో పాలుపంచుకున్న పండితులు ముస్లింలు, క్రైస్తవులు, యూదులు, జొరాస్ట్రియన్లు మరియు హిందువులు. వారిని అతడు పోషించాడు.  గ్రీస్ నుండి సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, గాలెన్, హిప్పోక్రాటిక్స్, ఆర్కిమెడిస్, యుక్లిడ్, టోలెమి, డెమాస్తెనెస్ మరియు పైథాగోరస్ రచనలు వచ్చాయి. బ్రహ్మగుప్తా యొక్క సిద్ధాంతం, భారతీయ సంఖ్యలు, సున్నా మరియు ఆయుర్వేద ఔషధం మొదలగు భావనలతో భారతదేశం నుండి ఒక ప్రతినిధి బృందం వచ్చింది. చైనా  నుండి రసవాద శాస్త్రం, కాగితం, పట్టు, కుండల సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. జొరాస్ట్రియన్లు పరిపాలనవ్యవసాయం, నీటిపారుదల శాఖలలో ప్రతిభను తీసుకువచ్చారు. ముస్లింలు ఈ వనరుల నుండి నేర్చుకున్నారు, ప్రపంచానికి ఆల్జీబ్రా, కెమిస్ట్రీ, సోషియాలజీ, ఇన్ఫినిటీ భావనలను అందించారు.



ముస్లింలకు ఇతర నాగరికతలతో పరిచయం ఏర్పర్చుకోవాలనే కోరిక కలిగింది.  ముస్లింలు ఇతర నాగరికతలతో పరిచయం పెంచుకొన్నారు మరియు వాటిని తమలో అన్వయించు  కొన్నారు. దివ్య ఖురాన్ ప్రతి ముస్లిం స్త్రీ-పురుషుడిని జ్ఞానం కోసం  ఆహ్వానిస్తుంది.  ఈ కాలంలోనే  క్లాసికల్ ఇస్లామిక్ నాగరికత, హకీమ్ (అర్ధం, జ్ఞానం ఉన్న  వ్యక్తి) యొక్క ఆవిర్భావం చూస్తాం. హకీం యొక్క అన్వేషణ కేవలం జ్ఞానం కాదు, సృష్టి యొక్క మరియు దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించే అంతర సంబంధాలపై ఆధారపడే ముఖ్యమైన ఐక్యత యొక్క పరిపూర్ణత. హారూన్ సాహిత్యానికి పెద్ద పీట వేశాడు, కవిత్వం మరియు సంగీతం బాగా వర్థిల్లాయి. తాను స్వయంగా పండితుడు మరియు కవి. తన దర్బారులో సాహితీవేత్తలూ, పండితులూ ఎల్లప్పుడూ గౌరవాలు పొందేవారు. ఇతర దేశాల రాయబారులు, వర్తకులు, యాత్రికులూ, తరచూ ఇతని దర్బారును సందర్శించేవారు. ఇలా ప్రపంచం మొత్తం ఇతడి పేరు ప్రాకింది. చరిత్రకారుల  తరాబీ  ప్రకారం, హారూన్ రషీద్ కు, వైద్యం చేయడానికి వైద్యులు భారతదేశం నుండి వచ్చేవారు. హారూన్ అన్ని దేశాల వారితో చైనాతో సత్సంబంధాలు కలిగివుండే వాడు. అత్-తరాబీ ప్రకారం, హారూన్, ధార్మికుడూ, దానవంతుడూ, ఉదాత్తుడూ, కవులను పోషించినవాడూ, ధార్మికంగా జరుగు విమర్శలనూ జగడాలనూ పరిసమాప్తి చేసినవాడు. ఇతడు న్యాయపరిపాలకుడు.హారూన్ రషీద్ కాలం రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఉచ్ఛదశకు చేరుకుంది. అరేబియన్ నైట్స్  ఇతని కాలంలో ఇబ్నె కసీర్ వ్రాయబడింది. దీని అనేక కథలలో హారూన్ రషీద్ కేంద్రబిందువు.దీనితో ఇతను అందరికీ ఆదర్శవంతుడిగా మారాడు. సైనిక పరంగా, మేథోపరంగానూ పేరుప్రఖ్యాతులు గడించాడు.  

హరూన్ ప్రారంభించినది అతని కుమారుడు మామున్ పూర్తి చేయాలని కోరుకున్నాడు. మమున్ వైద్యం, ఫిక్హ్, తర్కశాస్త్రంలో  పండితుడు మరియు ఖుర్ఆన్ లో  హఫీజ్. అతను కాన్స్టాంటినోపుల్ మరియు భారతీయ మరియు చైనీస్ ఆస్థానాలకు ప్రతినిధులను పంపించాడు. శాస్త్రీయ పుస్తకాలు మరియు పండితులను తన ఆస్థానానికి  పంపాలని కోరినాడు. అతను అనువాదకులని ప్రోత్సహించాడు మరియు వారికి గొప్ప ప్రతిఫలాలను ఇచ్చాడు. ఇస్లాం యొక్క మొదటి తత్వవేత్త, అల్ కింది ( 873), ఈ సమయంలో ఇరాక్ లో  పనిచేశారు.ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు అల్ ఖ్వారిజ్మి ( 863) మమున్ ఆస్థానం లో  పనిచేశారు. అల్ ఖర్విజ్మి గణిత సమస్యలను పరిష్కరిస్తున్న పునరావృత పద్దతికి ప్రసిద్ధి చెందారు, ఇది నేటికి కూడా ఉపయోగించబడుతుంది మరియు అల్గారిథమ్స్ గా పిలవబడుతుంది. . అతను బాగ్దాద్ లో  కొంతకాలం చదువుకున్నాడు మరియు భారతదేశానికి ప్రయాణించాడని కూడా తెలుస్తుంది.  అల్ ఖర్విజ్మి అనే పదం నుంచి  అల్జీబ్రా అనే పదాన్ని (అరబిక్ పదమైన jbr నుండి, గుణించడం అని అర్ధం) కనుగొన్నారు. భారతీయ సంఖ్యా వ్యవస్థను ముస్లిం ప్రపంచానికి పరిచయం చేసింది (యూరప్ కు  ప్రయాణించి, "అరబిక్" సంఖ్యా వ్యవస్థగా మారింది).  గణితంలో దశాంశ వాడకాన్ని ఉపయోగించడం మరియు ఖగోళశాస్త్రంలో అనుభావిక పద్ధతి (కొలత ఆధారంగా జ్ఞానం) కనుగొన్నారు. భూగోళ శాస్త్రం మరియు ఖగోళశాస్త్రంపై అనేక పుస్తకాలు రాశారు మరియు ఒక ఆర్క్ నుండి మరొక యార్క్ యొక్క దూరం యొక్క కొలతలో సహకరించాడు. విజ్ఞానశాస్త్రం మరియు ఇంజనీరింగ్ యొక్క ప్రతి విభాగంలో "అల్గారిథమ్స్" ను ఉపయోగించడం ద్వారా ఈ  నాటికి  అల్ ఖర్విజ్మి పేరును ప్రపంచం గుర్తింస్తుంది. హునున్ మరియు మమూన్ల సమయంలో విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు నడిపించి మేధో వికాసం  మరియు ఇస్లామిక్ నాగరికత ఐదు వందల సంవత్సరాలు ముందుకు దారితీసింది. బాగ్దాద్ యొక్క అనువాద పాఠశాలలు (బైతుల్ హిక్మా)  వైద్యుడు అల్ రజి ( 925), చరిత్రకారుడు అల్ మసూడి ( 956), వైద్యుడు అబూ ఆలీ సిన ( 1037), భౌతిక శాస్త్రవేత్త అల్ హజెన్ (1039), చరిత్రకారుడు అల్ బరునీ ( 1051), గణితవేత్త ఒమర్ ఖయాయం (1132) మరియు తత్వవేత్త ఇబ్న్ రష్ద్ (1198)రచనల వికాసానికి తోడ్పడినవి. 

ఇస్లామిక్ చరిత్రలో హరూన్ మరియు మమున్ల సాదించిన విజయాలతో ముస్లింలు గర్వపడతారు. ఆ నాటి ముస్లిం శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలు తమ మేదోవికాసం తో విజ్ఞాన ప్రగతి సాదించారు ప్రపంచ విజ్ఞాన చరిత్ర లో శాశ్వత కీర్తి గడించారు.  హరున్ మరియు మమున్ల కాలం  హేతువు/వివేచనకు  (reason)కు ప్రసిద్ది చెందినది.
మన సినిమావాళ్ళు ఇప్పటికైనా మారాలి
   -అమెరికాలో స్థిరపడిన 
ప్రముఖ నృత్యకళాకారిణి శ్రీమతి లక్ష్మిబాబు



(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)
     మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు పరిరక్షించడంలో మన సినిమాలు ముఖ్య పాత్ర పోషించాలి. 'శంకరాభరణం' సినిమా చూసి లక్షలాది తెలుగువాళ్లు సంగీతం నేర్చుకున్నారు. అలాంటి స్వర్ణ యుగం మళ్ళీ రావాలి. మన సినిమావాళ్లు ఇప్పటికయినా మారాలి' అంటున్నారు అమెరికాలో స్థిరపడిన అచ్చ తెలుగు నృత్య కళాకారిణి శ్రీమతి లక్ష్మీబాబు. తెలంగాణా ఆడబిడ్డ అయిన లక్ష్మి.. వివాహానంతరం సికింద్రాబాద్ నుంచి అమెరికాలోని మేరీల్యాండ్ వెళ్లి... గత 30 ఏళ్లుగా భర్తాపిల్లలతో అక్కడే ఉంటున్నారు. 


     'ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా' అన్నట్లు.. భారతీయ మూలాలు మర్చిపోకుండా..  వాటిని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తమ పిల్లలతోపాటు అక్కడ స్థిరపడ్డ తెలుగు కుటుంబాల పిల్లలు అక్కడి విపరీత ధోరణులకు అలవాటు పడకుండా..  తెలుగు పద్యాలు, శతకాలు, కీర్తనలు, నృత్యాలు నేర్పిస్తూ, మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు చూపిస్తూ.. అక్కడి తెలుగువారందరి అభిమానాన్ని విశేషంగా చూరగొంటున్నారు. స్వతహా కూచిపూడి నాట్యంలో నిష్ణాతురాలైన లక్ష్మీబాబు... నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా చేస్తున్న కరాళ నృత్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ప్రకృతికి మానవాళి చేస్తున్న అపరాధాలను మన్నించమని వేడుకుంటూ.. 'ఆకాశనృత్యం' పేరుతొ ఓ డాన్స్ ఫ్యూజన్ రూపొందించి తన ప్రతిభను తాజాగా ఘనంగా చాటుకుంటున్నారు. ఈ వినూత్న నృత్య రూపకంలో.. మన భారతీయ నృత్యాలు 'కూచిపూడి-సత్రియ-భరతనాట్యం-చావ్-కథక్-మోహినీఘట్టం-ఒడిస్సీ-కథకళి-మణిపురి' మిళితం చేసి ఉండడం విశేషం. అప్పట్లో ప్రపంచాన్ని పట్టి కుదిపేసి, కోట్లాది మరణాలకు కారణమైన ప్లేగు వ్యాధి గురించి 'లయర్' అనే నాటకంలో షేక్స్పియర్ చర్చించినట్లు.. 'ఆకాశ నృత్యం'లో కరోనా గురించి ప్రస్తావించామని లక్ష్మీబాబు పేర్కొన్నారు.


     చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే మక్కువ మెండుగా కలిగిన లక్ష్మీబాబు... ఇప్పటివరకు కుటుంబ బంధాలు, బాధ్యతలతో తలమునకలుగా ఉండి, తన ప్యాషన్ పై దృష్టి పెట్టలేకపోయానని చెబుతారు. ఇప్పుడు నటనపై తనకు గల తపన తీర్చుకునేందుకు ఈమె సన్నాహాలు చేసుకుంటున్నారు. అమెరికాలో షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో తన ప్రతిభకు, వయసుకు తగ్గ పాత్రల్లో నటించే అవకాశం వస్తే.. తప్పక వినియోగించుకుంటానని అంటున్నారు శ్రీమతి లక్ష్మీబాబు!!



మఖానా...మఖానా నీతో ఎంతో మేలా...?
ఫాక్స్ నట్స్ (మఖానా) – సాయంత్రం అల్పహారంగా భలే
వీటి వాడకం ద్వారా అద్భుత ప్రయోజనాలు

రచయిత-సల్మాన్ హైదర్




ఉరుకులు...పరుగుల జీవితంతో రోజుకు మూడు పూటల పరిపుష్టగా తినడం వంటి పరిణామాలు జరగడంలేదు. అందుకే నేడు అందరూ అల్పహార విందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం పుట్ట అల్పహార సేకరణ ఈ రోజులు పరిపాటిగా మారింది. ఏ టిఫిన్ హోటల్ చూసిన సాయంత్రం వేళ మనకు కళకళలాడుతూ కనిపిస్తాయి. మరి అయిల్ తో చేసే అల్పహారం కంటే తేలికపాటిగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలు ఉన్నాయి. అవే ఫాక్స్ నట్స్(మఖానా) 
మనము  తేలికపాటి సాయంత్రం అల్పాహారం గురించి ఆలోచించినప్పుడు, ఆరోగ్యకరమైన అల్ఫాహారం గా ఫాక్స్/లోటస్  గింజలు గుర్తుకు  వస్తాయి. వీటిని ఫూల్ మఖానా (పుష్పించే రూపం కారణంగా), తామర విత్తనాలు అని కూడా పిలుస్తారు.

ఫాక్స్ నట్స్ (మఖానా) గొప్ప చిరుతిండి, బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ అద్భుతమైన, ఆర్థిక, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం గురించి తెలుసుకొందం.

ఫాక్స్ నట్స్ /మఖానా యొక్క 12 అద్భుతమైన ప్రయోజనాలు

1.ఫాక్స్ నట్స్ (మఖానా) లో కేలరీలు, కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల అవి భోజనం మధ్య అల్పాహారంగా పూర్తి అనుభూతిని కలిగిస్తాయి, అతిగా తినాలి  అనే  కోరిక తగ్గుతుంది..

2. తక్కువ సోడియం, అధిక పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ వలన అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

3. ఫాక్స్ నట్స్ (మఖానా) లో అధిక కాల్షియం ఉంటుంది కనుక ఎముక, దంతాల ఆరోగ్యానికి మంచిది.

4. వాటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది, మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది. 

5. ఫాక్స్  గింజలు రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటాయి, మూత్రపిండాల వ్యాధులకు ఉపయోగపడతాయి.

6. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణ కు తోడ్పడును.

7. ఫాక్స్ నట్స్ (మఖానా) లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలకు పరిష్కారం లబిస్తుంది..

8. ఫాక్స్ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యం, శరీరంలో దీర్ఘకాలిక మంట, ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఉపయోగపడతాయి
9. స్త్రీ, పురుషులలో మఖానా సంతానోత్పత్తి రేటును మెరుగుపరుస్తుందని నమ్ముతారు. మఖానాను తిన్న స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణం మెరుగుపడుతుంది.

10. అధిక కాల్షియం, ఇనుము వలన గర్భిణీ స్త్రీలకు మఖానా ఇవ్వబడుతుంది. గర్భిణీ తల్లిలో రక్తపోటు, మధుమేహాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

11. ఫాక్స్ గింజలు నిద్రలేమి కి నివారణగా  సహాయపడతాయి. 

12. కాఫీ వ్యసనం నుండి బయటపడటానికి కొన్ని ఫాక్స్ గింజలను తినటానికి  ప్రయత్నించండి.

విభిన్న రెసిపీలలో ఫాక్స్ నట్స్ (మఖానా) ను ఎలా ఉపయోగించాలి.

1.ఫాక్స్ నట్స్ (మఖానా) విత్తనాలు వాస్తవానికి రుచిగా ఉంటాయి, అవి ఉప్పు లేదా తీపి తో అదనపు రుచిని పొందుతాయి

2. లేత మంట మీద కొద్దిగా నెయ్యితో విత్తనాలను వేయించుకోవాలి. ఉప్పు చల్లుకోండి, రుచికరమైన అల్పాహారం తయారు అవుతుంది.

3. దాల్చిన చెక్క లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు ఒకరి అభిరుచికి తగ్గట్టుగా చేర్చవచ్చు.

4. ఖీర్ మరియు ఇతర డెజర్ట్‌ ల వంటి తీపి వంటలలో కూడా ఫాక్స్ నట్స్ (మఖానా) వాడతారు.

మఖానా ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

మీరు చాలా ఆరోగ్యకరమైన, మీ ఆరోగ్యానికి తక్కువ ప్రమాదాలను కలిగి ఉన్న సూపర్ అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే, ఒక గిన్నె ఫాక్స్ గింజలను తినండి.