ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో
పాతబస్తీలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు
హాజరైన ప్రముఖులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
పాతబస్తీలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దూద్ బోలిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ భవనంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సంఘం అధ్యక్షులు గోరేటి ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకల్లో సిద్ధాంతి లక్ష్మణమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ చానల్ సీనియర్ రిపోర్టర్ కృష్ణమూర్తి
ఈ కార్యక్రమంలో పురాణా పూలు కార్పొరేటర్ సున్నం రాజమోహన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఏసిపి రుద్ర భాస్కర్, మాజీ ఏసిపి అశోక చక్రవర్తి, టిఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ పుస్తె శ్రీకాంత్, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, మజ్లీస్ పార్టీ నాయకులు రాజు, యువజన విభాగం నాయకుడు దీపేష్ కుమార్ లతోపాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మహిళా మండలి సభ్యులు వాసవి భవనం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
TRENDING NOW
వయోవృద్ధులకు పెద్ద కొడుకు ముఖ్యమంత్రి కేసీఆర్
శ్రీరామ్ నగర్ కాలనీ ఆత్మీయ సమ్మేళన సభ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రాష్ట్రంలోని వయోవృద్ధులకు పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వయోవృద్ధులకు రూ. 2వేల పెన్షన్ ఇస్తూ పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు, మిషన్ భగీరథ , చెరువుల సుందరీకరణ అక్కడితో ఆగకుండా కంటి వెలుగు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసి అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ఒకప్పుడు జలపల్లి కి రావాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం పక్కా డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అన్ని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పనులు జరగాల్సి ఉందని, వాటిని కూడా దశల వారీగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదలైన వారు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వారు రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుండి ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అమలులోకి రానుందని, ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారు 2020 లోపు ఉన్నవారు అర్జీ పెట్టుకోవాల్సిందిగా మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని బలపరిచి అభివృద్ధికి బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, జలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, సూరెడ్డి కృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్,,,
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్ నియామకం
కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా *యాతం పవన్ కుమార్ యాదవ్ ఎంపిక
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందజేసిన రామిడి రాంరెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా యాతం పవన్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్ పేట్ కార్పోరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి బడంగ్ పేట్ మునిసిపల్ కార్పోరేషన్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా సూర్ణగంటి అర్జున్, కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా యాతం పవన్ కుమార్ యాదవ్ ను నియమించారు. బుధవారం నాడు బడంగ్ పేట్ కార్పోరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని కలసి వీరి నియమకపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్,యతం పవన్ కుమార్ యాదవ్, పెద్ద బావి శోబా ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామిడి కవిత రాంరెడ్డి, బీమిడి స్వప్న జంగా రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, జేనిగే భారతమ్మ కొమురయ్య యాదవ్, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, లిక్కి మమత కృష్ణ రెడ్డి, బోద్రమోని రోహిణి రమేష్, సుక్క శివ కుమార్, కో ఆప్షన్ సభ్యులు గుండోజు రఘునందన్ చారి, గుర్రం ప్రస్సన్న వెంకట్ రెడ్డి, మర్రి జగన్ మోహన్ రెడ్డి, ఈ ఎల్ వి జ్యోతి అశోక్, షేక్ ఖలీల్ పాషా, నాయకులు నిమ్మల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ స్థలాల రెగ్యులరైజ్ కు అవకాశం,,, వాటిని సద్వినియోగం చేసుకోండి --విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఆ స్థలాల రెగ్యులరైజ్ కు అవకాశం
వాటిని సద్వినియోగం చేసుకోండి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెగులరైజ్ చేసుకోవటానికి మరొక అవకాశం కల్పించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. వచ్చే నెల ఏప్రిల్ 1 వ తేదీ నుండి 58,59 జి ఓ లకు సంభందించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి తెలిపారు. సోమవారం నాడు మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి రెవెన్యూ అధికారులతో 58,59 జి ఓ లకు సంభందించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో 2014 వరకు కట్ ఆఫ్ గా ఉండగా తాజాగా 2020 జూన్ 2 వరకు కట్టుకున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నోటరీ,ఇతరత్రా ప్లాట్ ల పైన కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గములో 58 జి ఓ ద్వారా 966 మంది లబ్ధిదారులకు హక్కులు కల్పించినట్లు త్వరలో వాటిని పంపిణీ చేస్తామన్నారు.ఏప్రిల్ 1 నుండి 30 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, తహశీల్దార్ లు జనార్దన్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మాక్ ఎంసెట్ తో విద్యార్థులకు పరీక్షలపై ఒక అవగాహన వస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. ప్రముఖ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లాట్ఫారం సంస్థ ఐన ఎక్స్ ప్లోర్.కో. ఇన్ (Xplore.co.in ).. గీతాంజలి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కీసర, ఆధ్వర్యములో నిర్వహించబడు మాక్ ఎంసెట్ టెస్ట్ సిరీస్ కు సంబందించిన పోస్టర్ ను సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్వచ్చందంగా ముందుకు వచ్చి మాక్ టెస్ట్ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు
.విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి పరీక్షలు రాయాలని సూచించారు. సంస్థ డైరెక్టర్ అఖిల్ మోదే మాట్లాడుతూ ఈ సిరీస్ లోని నాలుగు మాక్ టెస్టులను ఎంసెట్ కు హాజరు కానున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి ప్రాక్టీస్ కొరకు వినియోగించుకొనవచ్చు నని తెలిపారు. పరీక్ష వ్రాసిన వారికి వారి ఫలితాలు వెంటనే తెలియబడుతాయని,
తద్వారా మెయిన్ పరీక్షలకు విద్యార్థులు మరింత మెరుగైన కృషి చేయవచ్చునని తెలిపారు. సంస్థ డైరెక్టర్ తాడేపల్లి సునీల్ గారు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి ప్రమాణాలతో కూర్చబడినవి అని తెలిపారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు https://tseamcet.xplore.co.in/ నందు నమోదు చేసుకొనవలసినదిగా కోరారు. మొదటి మాక్ టెస్ట్ ఏప్రిల్ 5వ తేదీన ఉదయం 9 గం నుండి సాయంత్రం 5 గం వరకు https://tseamcet.xplore.co.in/ లో అందుబాటులో ఉంటుంది. తదుపరి మాక్ టెస్టులు ఏప్రిల్ 15, 25 మరియు 30 తేదీలలో నిర్వహించబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో Xplore company మార్కెటింగ్ హెడ్ ప్రణీత్ నల్లి కూడా పాల్గొన్నారు.
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్
అలాంటి నాయకుడి నాయకత్వాన్ని బలపర్చాలి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అనిత రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ రైతు మార్కెట్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ రమణ, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని మన రాష్ట్రం మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కొనియాడారు.
ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కంకణం కట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి పట్టుదల కృషి అమోఘమని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని సబితా ఇంద్రా రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పాలిట పెన్నిధిగా ఉందని రోజు ఈ ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమం ద్వారా నాయకులు కార్యకర్తలు కలిసి అభివృద్ధి పై చర్చ జరిపి మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని ఎల్ రమణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పలువురు దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, వేముల నరసింహ, ఇంద్రవత్ రవి నాయక్, విజయ్ సౌందర్య, రాజు విజయలక్ష్మి,, నందు, లెనిన్ నగర్ పవన్, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
గని గ్రామంలో పిడుగుపాటుకు.....
వ్యక్తి మృతి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గని గ్రామంలో సాయంకాలం కురిసిన అకాల వర్షానికి పిడుగుపాటుకు తుమ్ము లూరు వెంకటరమణ (41) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు.
అంగరంగ వైభవంగా...
శ్రీ మహంకాళేశ్వర దేవాలయం ఏడవ వార్షికోత్సవ వేడుకలు
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ నిర్వాహకులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
మీరాలందుండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం ఏడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం నాడు దేవాలయం కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం మాతృక పూజనం, కాంది. ఆచార్య ఋత్విక్వర్థం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి బ్రహ్మదిమండల స్థాననం నవగ్రహ దేవత స్థాదన పూలు, లక్ష్మీస్థావడం. రుద్రవీర స్థాపనం, ఆంజనేయ, సుబ్రమణ్య స్థావనం తదితర కార్యక్రమ కొనసాగాయి.
అగ్ని ప్రతిష్ట, రుద్ర హోమం, చండీ హోమం, మక్త్యాసత్త -నవగ్రహం హోమం మహా కుంభాభిషేకం పూర్ణాహుతి జరిగాయి. వేద పండితుల మంత్రోచరణాల నడుమ జరిగిన కార్యక్రమంలో దేవాలయం కమిటీ ఉపాధ్యక్షులు కాటా రమేష్ దంపతులతో పాటు కోటిరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంజాన్ మాసం సందర్భంగా.... రుచికరమైన...నాణ్యమైన హలీమ్
అందుబాటులోకి తీసుకొచ్చిన పిస్తా హౌస్
నణ్యాతతోపాటు పోషకల విషయంలో రాజీేలేదు: మహ్మద్ అబ్దుల్ మాజీద్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
ముస్లింలు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం ప్రారంబమైనది. ఈ మాసం లో పగలంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు సాయంత్రం దీక్ష విరమణ సమయంలో ఖజూర్, పండ్లు ఫలాలతోపాటు గుమగుమలాడే ఎంతో రుచకిరమైన, బలవర్ధకమైన, పలు పోషకాలతో కూడిన 'హైదరాబాదీ హలీమ్ ను అరగిస్తారు. హైదరాబాద్ జంటనగరాలతోపాటు, దేశ, విదేశాలలో పేరిన్నికగన్న శాలిబండలోని పిస్తా హౌస్ నిర్వాహకులు అరబ్ పంటకమైన హలీమ్ విక్రయాలలో ముందంజలో ఉన్నారు. త యారీకి సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పిస్తా హౌస్ సీఈఓ మహ్మద్ అబ్దుల్ మాజీద్ మాట్లా డుతూ . నాణ్యమైన వస్తువులు, వివిధ పోషక విలువ లతో కూడి తక్కువ కొలస్ట్రాల్ కలిగిన 'హైద రాబాద్ హలీమ్ 'ను తయారు చేస్తున్నామన్నారు.
పిస్తా హౌస్ అలీం విక్రయం కోసం దేశ విదేశాలతోపాటు నగరంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్లేట్ హలీం రూ.260, ఫ్యామిలీ ప్యాక్ ధర 990రూ, హాలీం మినీప్యాక్ రూ 750రూపాయలుంటుదని ఆయం తెలిపారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు హలీమ్ లభిస్తుందని ఆయన వెల్లడించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి దోషులను శిక్షించాలి
పేపర్ లీక్ ఘటనపై బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ డిమాండ్
"మా నౌకరీలు మాగ్గావాలె - నిరుద్యోగ మహాధర్నా"లో పాల్గొన్న బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
టిఎస్పీఎస్సి పేపర్లు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన "మా నౌకరీలు మాగ్గావాలె - నిరుద్యోగ మహాధర్నా" కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం విద్యార్థులు సాధించిన తెలంగాణలో సంవత్సరాలుగా తల్లితండ్రులకు దూరంగా,
ఇల్లు వాలికి తాకట్టు పెట్టుకొని మరి ఉద్యోగాలు సాధించాలన్న పట్టుతో నిరుద్యోగులు తిండి తిప్పలు లేకుండా కస్టపడి పరీక్షలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈరోజు నిరుద్యోగులను రోడ్డున పడేసిందని విమర్శించారు. అందుకే వారికీ అండగా నిలబడటానికి బిజెపి మరో తెలంగాణ నిరుద్యోగ ఉద్యమానికి సిద్ధమైందని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి టిఎస్పీఎస్సి పేపర్ లీక్ అస్సలు దోషులను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎల్గని నగేష్ గౌడ్, నీరటి కుమార్, నీరటి నర్సింహా, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని....
దర్శించుకొన్న చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయాన్ని చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ దర్శించుకొన్నారు. శుక్రవారంనాడు దేవాలయానికి వచ్చిన ఏసీపీ రుద్ర భాస్కర్ ను ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పోసాని సురేంధర్ ముదిరాజ్ స్వాగతం పలికారు. అనంతరం శాలువతో ఏసీపీ రుద్ర భాస్కర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, విట్టల్ తదితరులు పాల్గొన్నారు .
ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానంపై అవగాహన కలిగివుండాలి
సిపిఆర్ ద్వారా గుండెపోటుకు గురైన వారిని రక్షించవచ్చ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా వారి ప్రాణాలను రక్షించవచ్చని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సిబ్బందికి శిక్షణలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనశైలి ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్టులు ఆకస్మిక గుండెపోటులు పెరిగాయని, గుండెపోటుకు గురైన వారికి వెంటనే కారియో పల్మనరీ రీససిటేషన్ సిపిఆర్ చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వస్తున్నాయని, గుండెపోటు వచ్చిన వారికి వైద్యుని కొరకు వేచి చూడకుండా వెంటనే సిపిఆర్ నిర్వహించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని అన్నారు. ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ,
వాహనం వచ్చే పది నిముషాల వరకు సిపిఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్నీ, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని అన్నారు. గుండె పోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడొచ్చని సిపిఆర్ పై అవగాహన ఉండడం ద్వారా మానవతా దృక్పధంతో సకాలంలో స్పందించి సిపిఆర్ నిర్వహించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆ దిశగా శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాసుపత్రులల్లో పుట్టబోయే బిడ్డను నుండి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. ఆరోగ్యమే మాహాభాగ్యం అంటే సమాజానికి ఆరోగ్యకరమైన మానవ వనరులను అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని అన్నారు.
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సర్వసభ్య సమావేశాల ద్వారా, అంగన్ వాడిల ద్వారా, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా ప్రజలకు సీపీఆర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను అందిస్తున్నారని, పట్టణాలలో బస్తి దవాఖానాలు, పల్లెలో పల్లె దవాఖానాలు, వంద పడకల ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఇంటికి ఇంటికి వెళ్ళి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. అనంతరం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు.ఎన్.సి.డి. కిట్లు అందజేశారు.
జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ఇటీవల వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారని, వారికి సకాలంలో సిపిఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. సిపిఆర్ అంటే ప్రజలలో చాలా మందికి అవగాహన వచ్చిందని, కానీ ఎలా చేయాలో తెలియదని ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి, ఊపిరి తీసుకుంటున్నారో పరిశీలించాలని, గుండె పోటు అని నిర్దారణకు వచ్చిన వెంటనే
108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ ఒక నిముషంలో 100 నుండి 120 సార్లు గుండెపై రెండు చేతులతో పుష్ అప్ చేస్తూ మధ్య మధ్య ఊపిరి అందిస్తుండాలని, ఏ.ఈ.డి.యంత్రం ద్వారా షాక్ ఇవ్వాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని, ఆ స్ఫూర్తితో ఫ్రంట్ లైనర్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జిల్లాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీ బృందాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సిపిఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి నిజంగా గుండెపోటుకు గురయ్యారా లేదా అని గుర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్యెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తదితరులు పాల్గొన్నారు.